పూరీ జగన్నాధ్ ఆ మధ్య రవితేజ హీరోగా సినీ పరిశ్రమ నేఫద్యంలో నేనింతే అనే ఫ్లాప్ సినిమా తీసారు. ఎంతో అనుభవం,ఎన్నో హిట్లు ఉన్న ఆయన ఇలా తీయటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. అయితే తాజాగా హిందీలో లక్ బై ఛాన్స్ పేరుతో ఓ సినిమా రిలీజైంది. ఫర్హాన్ అఖ్తర్ (దిల్ చాహతా హై,డాన్ డైరక్టర్)హీరోగా, కొంకణా సేన్ శర్మ కాంబినేషన్లో నూతన దర్శకురాలు జోయా అఖ్తర్ రూపొందించిన ఈ సినిమా అందరి ప్రశంసలూ పొందుతోంది. నేనింతే కి దీనికి పోలిక ఏమిటీ అంటే...లక్ బై ఛాన్స్ సినిమా కూడా సినీ పరిశ్రమ నేఫద్యంలో రూపొందించిందే.
సినీ పరిశ్రమపై తనకున్న అభిప్రాయాలే కాక,సహజత్వానికి పెద్ద పీట వేసి,హీరోయిజం,ఫైట్స్ వంటివి పెట్టకుండా తీర్చిదిద్దిన విధానం హిందీ పరిశ్రమలోనే కాకుండా తెలుగు పరిశ్రమలోనూ చాలామంది చేత శభాష్ అనిపించేలా చేస్తోంది. దాంతో ఎంతవద్దనుకున్నా వారి టాపిక్స్ లో పూరీ నేనింతే ప్రశక్తి వస్తోంది. వారు ఈ సినిమాను పూరీ చూస్తే(ఇప్పటికే చూసుంటే ఇబ్బంది లేదు)బాగుంటుందని సూచిస్తున్నారు. మరికొంతమందయితే...పూరీకి ఈ సినిమా టిక్కెట్ పంపాలి..గాంధీగిరిలా అనే కామెంట్స్ సైతం చేసుకుంటున్నారు.

No comments:
Post a Comment