
దక్షిణాది చిత్ర పరిశ్రమను ఒక ఊపు ఊపిన పొడవు కాళ్ల సుందరి సిమ్రాన్. హీరోలకు అల్లుళ్లు వచ్చినా నటించగాలేందీ నేను నటిస్తే తప్పేంటని ప్రశ్నిస్తోంది. పెళ్ళయి బాబు పుట్టాక కూడా తనలో ఏ మాత్రం అందం తరగలేదని తనకూ ఓ ఛాన్స్ ఇవ్వాలని నిర్మాతలకు విన్నవించుకుంటోంది.
తన కెరీర్ మంచి ఊపుమీద ఉన్నప్పుడే సినిమాలకు స్వస్తి చెప్పి వివాహం చేసుకున్న సిమ్రాన్, ప్రస్తుతం తాను అంతకుముందులాగే నటించగలనని అంటోంది. వివాహం అయినంత మాత్రాన నాలో అందం ఎక్కడికీ పోలేదని, చక్కగా డాన్స్ చేయగలనంటోంది. ఇదిలా ఉండగా కృష్ణభగవాన్ సరసన 'జాన్ అప్పారావు 40 ప్లస్' చిత్రంలో హీరోయిన్ పాత్ర పోషించి తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ను ప్రారంభించిన సిమ్రాన్ తాజాగా కోలీవుడ్లోనూ తన హవాను కొనసాగిస్తోంది.
ఇకపోతే తాజాగా రూపుదిద్దుకుంటున్న ఓ కోలీవుడ్ మూవీలో సిమ్రాన్ హీరోయిన్ పాత్రను పోషిస్తోంది. ఇందులో విలన్ పాత్రలను పోషిస్తూ హీరోగా ఎదిగిన 'పశుపతి' కథానాయకుడుగా నటిస్తున్నాడు. సూర్య సూపర్ హిట్ మూవీ 'సూర్య సన్నాఫ్ కృష్ణన్'లో కూడా సిమ్రాన్ ఓ హీరోయిన్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. అయినా జాన్ అప్పారావు 40+ అన్నప్పుడే నిర్మాతల మనసులో కూడా సిమ్రాన్ 40+ అనే ముద్ర పడిపోయిందని సినీజనం అనుకుంటున్నారు.
No comments:
Post a Comment